లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 80,623 వద్ద, నిఫ్టీ 24,645 దగ్గర ట్రేడింగ్‌ కొనసాగుతున్నది.

By :  Raju
Update: 2024-08-20 04:11 GMT

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 80,623 వద్ద, నిఫ్టీ 24,645 దగ్గర ట్రేడింగ్‌ కొనసాగుతున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.85 వద్ద ప్రారంభమైంది.సెన్సెక్స్‌ సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నిన్న ఒడిదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు స్తబ్దుగా ముగిశాయి. సూచీలపై ప్రభావం చూపెట్టే కీలక సంకేతాలు లేకపోవడంతో పెద్ద షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణ వంటివి ప్రభావం చూపాయి. బ్యారెల్‌ ముడిచమురు 0.82 శాతం నష్టంతో 79 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌లు లాభపడగా.. సియోల్‌, టోక్యో నష్టపోయాయి. ఐరోపా సూచీలు మాత్రం లాభాల్లో ట్రేడయ్యాయి. 

Tags:    

Similar News