నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి.

By :  Raju
Update: 2024-08-21 04:43 GMT

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు దీనికి కారణం. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్‌ 81 పాయింట్లు కోల్పోయి 80,738 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 24,675 వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.81 వద్ద ప్రారంభమైంది.

వరుస లాభాల నుంచి అమెరికా మార్కెట్లు మంగళవారం విరామం తీసుకున్నాయి. అక్కడ ప్రధాన సూచీలు నష్టలతో ముగిశాయి. ఇవాళ ఆసియా- పసిఫిక్‌ సూచీలు అదే బాటలో సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 77.09 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. 

Tags:    

Similar News