పేటీఎం షేర్లు డౌన్‌

సంస్థ చైర్మన్‌ కు సెబీ నోటీసులు

Update: 2024-08-26 10:58 GMT

పేటీఎం షేర్లు డౌన్‌ అయ్యాయి. పేటీఎం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ ఫౌండర్‌ చైర్మన్‌ శేఖర్‌ శర్మకు సెబీ షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంతోనే సంస్థ షేర్లు 8.88 శాతం క్షీణించాయి. 2021లో పేటీఎం ఐపీవో ప్రకటించింది. ఈక్రమంలో పబ్లిష్‌ ఇష్యూకు సంబంధించిన ప్రమోటర్‌ క్లాసిఫికేషన్‌ నిబంధనలు పాటించలేదని సెబీ విజయ్ శేఖర్‌ కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. చైర్మన్‌ తో పాటు సంస్థ మాజీ బోర్డు మెంబర్లకు నోటీసులు జారీ చేశారు. ఒక్కో షేర్‌ వ్యాల్యూ రూ.2,150లతో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లగా 9 శాతం డిస్కౌంట్‌ తో రూ.1,995 వద్ద లిస్టయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో పేటీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇప్పుడిప్పుడే కుదుట పడుతుండగా సెబీ నోటీసులు పేటీఎంతో పాటు ఇన్వెస్టర్లను భారీగా దెబ్బతీశాయి.

Tags:    

Similar News