ఐటీ షేర్ల పరుగులు.. కోలుకున్న దేశీయ సూచీలు

ఐటీ షేర్లు పరుగులు తీయడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోతలు సెప్టెంబర్‌లో మొదలు కావొచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారాయి.

By :  Raju
Update: 2024-08-15 03:21 GMT

ఐటీ షేర్లు పరుగులు తీయడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోతలు సెప్టెంబర్‌లో మొదలు కావొచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారాయి. దీంతో వరుసగా రెండు రోజుల నష్టాల నుంచి దేశీయ సూచీలు కోలుకున్నాయి. మరోవైపు ఆసియా మార్కెట్లలో సియోల్‌, టోక్యో లాభపడగా.. షాంఘై, హాంకాంగ్‌ నష్టోయాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 109 పాయింట్ల లాభంతో 79,065.22 వద్ద ప్రారంభమైంది. 79,228,94 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరికి 149.85 పాయింట్ల లాభంతో 79,105,94 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 4.75 పాయింట్లు పెరిగి 24,143.75 దగ్గర స్థిర పడింది.డాలర్‌తో పోలీస్తే రూపాయి 3 పైసలు పెరిగి 83.94 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి చమురు 0.59 శాతం లాభంతో 81.17 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. 

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు బీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్‌, ఫారెక్స్‌, కమోడిటీ మార్కెట్లూ పనిచేయవు. 

Tags:    

Similar News