ఆర్బీఐ సమీక్ష నిర్ణయాల ఎఫెక్ట్.. నష్టాల్లో సూచీలు

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయం మదుపర్లను నిరాశపరిచింది.

By :  Raju
Update: 2024-08-09 04:13 GMT

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా తొమ్మిదోసారి కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయం మదుపర్లను నిరాశపరిచింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు, బలహీన అంతర్జాతీయ సంకేతాలతో సూచీలు నష్టాల బాట పట్టాయి.

సెన్సెక్స్‌ చివరికి 582 పాయింట్లు కోల్పోయి 78,886 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 181 పాయింట్లు కోల్పోయి 24,117 దగ్గర స్థిరపడింది.డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 82.97 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.66 శాతం నష్టంతో 77.83 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. 

Tags:    

Similar News