స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

By :  Raju
Update: 2024-08-29 04:33 GMT

వరుసగా పదోరోజూ లాభపడిన నిఫ్టీ, జీవనకాల తాజా గరిష్ఠం వద్ద ముగిసింది. ఇవాళ అంతర్జాతీయ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 57 పాయింట్లు కోల్పోయి 81,798 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 25,034 వద్ద ట్రేడవుతున్నాయి.సొనాటా సాఫ్ట్‌వేర్‌, ఆర్తీ ఫార్మా ల్యాబ్స్‌, కాంకర్డ్‌ బయోటెక్‌, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌, నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ కో లాభాల్లో ఉండగా.. జెన్‌ టెక్నాలజీస్‌, పీఅండ్‌జీ హైజీన్‌ అండ్‌ హెల్త్‌, బాంబేడైయింగ్‌, ఐనాక్స్‌ విండ్‌, సెంచురీ పాలీబోర్డ్స్ లాభాల్లో ఉన్నాయి.

నిన్న డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 4 పైసలు తగ్గి 83.97 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.82 శాతం నష్టంతో 78.90 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. 

Tags:    

Similar News