టీ20 వరల్డ్‌లో సంచలనం..కివిస్‌పై ఆఫ్ఘన్ జయభేరి

న్యూజిలాండ్‌ పై ఆఫ్గానిస్థాన్ ఘన విజయం

Byline :  Vamshi
Update: 2024-06-08 10:26 GMT

టీ20 వరల్డ్‌లో న్యూజిలాండ్‌కు ఆఫ్గానిస్థాన్ షాకిచ్చింది. గ్రూప్ సీ భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో కివిస్‌పై 84 ర‌న్స్ తేడాతో విజ‌యం సాధించింది. టీ20 క్రికెట్‌లో కివీస్‌ను ఆఫ్ఘ‌న్ ఓడించ‌డం ఇదే పస్ట్ టైమ్. ప్రావిడెన్స్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ప్ర‌త్య‌ర్థి ఆప్ఘ‌న్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆఫ్ఘ‌న్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 159 ర‌న్స్ చేసింది. గుర్బాజ్‌, ఇబ్ర‌హీంలు తొలి వికెట్‌కు 103 ర‌న్స్ జోడించారు. గుర్బాజ్ 52 బంతుల్లో 80 ర‌న్స్ చేశాడు. దాంట్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ ఇద్ద‌రూ ఔటైన త‌ర్వాత ఆఫ్ఘ‌న్ బ్యాట‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు.

160 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ అనూహ్య రీతిలో చేతులెత్తేసింది. క్ర‌మ‌క్ర‌మంగా వికెట్ల‌ను కోల్పోయింది. ఆఫ్ఘ‌నిస్తాన్ ఆల్‌రౌండ్ షోతో ఆక‌ట్టుకున్న‌ది. ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ల‌లో ఫారూకీ, ర‌షీద్ ఖాన్‌లు చెరి నాలుగు వికెట్లు తీసుకున్నారు. కివీస్ బ్యాట‌ర్ల‌ను స్థిర‌ప‌డ‌కుండా చేశారు. గ్లెన్ ఫిలిప్స్‌, మ్యాట్ హెన్రీ మాత్ర‌మే రెండు అంకెల స్కోర్లు చేశారు. మిగితా బ్యాట‌ర్లు ఎవ‌రూ డ‌బుల్ డిజిట్ చేరుకోలేదు. కివీస్ జ‌ట్టు 15.2 ఓవ‌ర్ల‌లో 75 ర‌న్స్‌కే ఆలౌటైంది. టీ20 వరల్డ్ కప్‌లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. పసికూనలుగా అడుగుపెట్టిన జట్లు బలమైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నాయి. జూన్ 6న పాకిస్థాన్‌ను అమెరికా ఓడించింది. శ్రీలంక‌పై బంగ్లాదేశ్ గెలిచింది

Tags:    

Similar News