పుష్ప - 2 రిలీజ్‌ వాయిదా?

బన్ని అభిమానులకు నిరాశ కలిగించే ముచ్చట ఇది. పుష్ప -2 ఆగస్టు 15న కాకుండా దసరాకు రిలీజ్ అవుతుందని బాక్సాఫీస్ టాక్

Update: 2024-06-15 09:17 GMT

బన్నీ ఫ్యాన్స్‌ ఆగస్టు 15 కోసం ఎదురు చూస్తుంటే పుష్ప -2 టీమ్‌ వాళ్లను నిరాశ పరిచే సమాచారం ఇచ్చింది. పుష్ప -2 ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కావాల్సి ఉండగా అప్పటి వరకు షూటింగ్‌ పూర్తయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. దీంతో ముందే అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్‌ చేయలేరని బాక్సాఫీస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. అంతేకాదు ఎడిటింగ్‌, రీ రికార్డింగ్‌ సహా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చాలానే పెండింగ్‌ లో ఉండటంతో పుష్ప -2 దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప -1 ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. బన్నీని గ్లోబల్‌ స్టార్‌గా నిలబెట్టడంతో పాటు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందజేసింది. దీంతో పుష్ప స్వీకెల్‌కు అభిమానుల్లో భారీ క్రేజ్‌ ఉంది. ఇప్పటికే రెండు పాటలను మూవీ టీమ్‌ రిలీజ్‌ చేయగా వాటికి సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చింది. సినిమా రిలీజ్‌ ఖాయమని అందరు ఎదురు చూస్తున్న సమయంలో అనుకున్న సమయానికి పుష్ప -2 స్క్రీన్‌లలో సందడి చేయడని తెలుస్తోంది. సినిమా రిలీజ్‌పై మూవీ టీమ్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ విషయాన్ని అఫీషియల్‌ గా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Similar News