అక్కడ 'పఠాన్‌' కలెక్షన్లను దాటేసిన 'కల్కి 2898 ఏడీ'

'కల్కి 2898 ఏడీ' మూవీ మరో మైలు రాయిని చేరింది. నార్త్‌ అమెరికాలో ఈ మూవీ హవా కొనసాగిస్తున్నది.

By :  Raju
Update: 2024-07-31 04:36 GMT

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' మూవీ విడుదలకు ముందే హైప్‌ క్రియేట్‌ చేసినమరో మైలు రాయిని చేరింది. నార్త్‌ అమెరికాలో ఈ మూవీ హవా కొనసాగిస్తున్నది. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీకి ఓవర్సీస్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు.

అక్కడ ఈ చిత్రం షారుక్‌ ఖాన్‌ 'పఠాన్‌' కలెక్షన్స్‌ను అధిగమించింది. ఇప్పటిరవకు 19.5 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి నార్త్‌ అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో ఇండియన్‌ మూవీగా రికార్టు సృష్టించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది. గతంలో షారూఖ్‌ నటించిన 'పఠాన్‌' 17.45 మిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా.. తాజాగా 'కల్కీ' ఆ కలెక్షన్లను దాటేసింది.

మరోవైపు కల్కీ చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసినట్టు సమాచారం. కొంతమంది అభిమానుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బిగ్‌ బీ అమితాబ్‌ తన బ్లాగ్‌లో ఈ మేరకు పోస్ట్‌ పెడుతూ.. 'కల్కీ' టీమ్‌ కొంతమందితో ఒక షో ప్లాన్‌ చేస్తున్నది. దానికోసం ఇప్పటికే వర్క్‌ ప్రారంభమైంది. నేను పని చేస్తున్నాను. దయచేసి ఈ పోస్టును ఆహ్వానంగా భావించవద్దని కోరారు. ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్నదని, ఫలించవచ్చు.. విఫలమవ్వొచ్చు అని రాసుకొచ్చారు.

Tags:    

Similar News