బాక్సాఫీసు వద్ద కల్కి మూవీ ప్రభంజనం ..ఎన్ని కోట్లంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా మూవీ 'కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది.

By :  Vamshi
Update: 2024-07-06 15:52 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ బాక్సాపీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ రూ..800 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లు రాబట్టింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 మూవీలో ఒకటిగా నిలుస్తుంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.242 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే ఏకంగా రూ.100 కోట్లని 'కల్కి' సాధించినట్లు టాక్.

తమిళనాడులో రూ.24 కోట్లు, బాలీవుడ్‌లో రూ.164 కోట్లు, కర్ణాటక-తమిళనాడులో వరసగా రూ.25 కోట్లు, రూ.24 కోట్లు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ మూవీకి మన దగ్గర కంటే ఓవర్సీస్‌లో అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. ఎందుకంటే మిగతా హీరోలు ఒకటి లేదా రెండు మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడమే కష్టంగా మారుతుంటే.. 'కల్కి'తో ప్రభాస్ ప్రస్తుతం 14.5 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్నాడు. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో 14.3 మిలియన్ డాలర్స్‌తో ఉండగా ఇప్పుడు దీన్ని 'కల్కి' అధిగమించేసింది.. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్లు నటించిన ఈ చిత్రం థియేటర్లలో విజయ వంతంగా దూసుకెళ్తోంది.

Tags:    

Similar News