'కల్కీ 2998 ఏడీ' నెల రోజుల రికార్డులివే!

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ 'కల్కీ 2998 ఏడీ' తాజాగా నెల రోజులు పూర్తి చేసుకున్నది. ఈ నేపథ్యంలో కల్కీ సినిమా క్రియేట్‌ చేసిన రికార్డులు ఇవే.

By :  Raju
Update: 2024-07-28 06:45 GMT

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ 'కల్కీ 2998 ఏడీ' రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్‌ 27న విడుదలైన ఆ మూవీ ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకున్నది. ఈ మూవీ తాజాగా నెల రోజులు పూర్తి చేసుకున్నది. ఈ నేపథ్యంలో కల్కీ సినిమా క్రియేట్‌ చేసిన రికార్డులు ఇవే.

కల్కి నెల రోజుల రికార్డులు ఇవే..

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా కల్కీ రికార్డు నెలకొల్పింది. రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన 8వ ఇండియన్‌ మూవీ, మూడో తెలుగు చిత్రం. ఇంతకు ముందు బహుబలి2, ఆర్‌ఆర్‌ఆర్‌ ఉన్నాయి. అలాగే హిందీ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రం కూడా కల్కీనే. దీనికంటే ముందు బాహుబలి (రూ. 511 కోట్లు), కేజీఎఫ్‌2 (రూ. 435 కోట్లు) ఉన్నాయి.

బాహుబలి, కల్కీతో రెండుసార్లు రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన తెలుగు హీరో ప్రభాస్‌. ఈ ఘనతను సాధించిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ఖాన్‌. ఆయన నటించిన జవాన్‌, పఠాన్‌ మూవీస్‌ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరాయి.

ఉత్తర అమెరికాలో 18 మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన రెండో సినిమా ఇదే. (మొదటి మూవీ బాహుబలి 2). నేపాల్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా ఇదే (రూ. 23 కోట్లు). వీటితో పాటు ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికమంది వీక్షించిన సిరీస్‌లో 'బుజ్జి అండ్‌ భైరవ' కూడా ఒకటి. 

Tags:    

Similar News