బాక్సాఫీస్‌ వద్ద 'కల్కీ 2898 ఏడీ' సరికొత్త రికార్డు

'కల్కీ 2898 ఏడీ' సినిమా ఇప్పటికే పలు రికార్టులు క్రియేట్‌ చేసింది. తాజాగా మూవీ విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరింది.

By :  Raju
Update: 2024-07-13 10:22 GMT

ప్రభాస్‌ హీరోగా నటించిన 'కల్కీ 2898 ఏడీ'  మూవీ మరో మైలురాయిని దాటింది. జూన్‌ 27న విడుదలైన ఈ సినిమా విడుదలైన ప్రతీచోట కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్నది. ఇప్పటికే పలు రికార్టులు క్రియేట్‌ చేసిన ఆ మూవీ తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని ప్రకటించిన మూవీ టీం సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. అరుదైన రికార్డులు సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ ఇటీవల విడుదలైన సినిమాలను కూడా ఈ మూవీ పక్కనపెట్టింది. కల్కీ భారీగా కలెక్షన్లు సాధిస్తున్నదని బాలీవుడ్‌కు చెందిన క్రిటిక్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన బిగ్‌ బీ ఇదంతా నాగ్‌ అశ్విన్‌ ప్రతిభ అని ఆయన అద్భుతమైన పనితీరుకు ఈ మూవీ నిదర్శనం అంటూ కితాబు ఇచ్చారు. కల్కీ సినిమా ప్రపంచవ్యాప్ంగా రూ. 1000 కోట్లు వసూలు చేసిందంటూ ట్వీట్‌ చేస్తే ..ఉఫ్‌ ఇదో అద్భుతం అంటూ కామెంట్‌ చేశారు. ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ అద్భుతంగా నటించారు. ఆయన పాత్రపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. మరోవైపు ఈ సినిమా విజయాన్ని ఆయన భారీగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News