ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్
త్వరలోనే సెట్లోకి అడుగుపెట్టడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్
By : Raju
Update: 2024-08-24 08:56 GMT
నటుడు రవితేజ తన తదుపరి మూవీ షూటింగ్ చిత్రీకరణలో భాగంగా గురువారం స్వల్పంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఆ గాయాన్ని పట్టించుకోకుండా షూటింగ్లో పాల్గొనడంతో అది తీవ్రమైంది. ఈ క్రమంలోనే ఆయన కుడి చేతికి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది.ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
శస్త్ర చికిత్స అనంతరం ఆస్పత్రి డిశ్చార్జ్ అయిన రవితేజ తాజాగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా క్షేమాన్ని కాంక్షిస్తూ మెస్సేజ్‌లు పంపిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే సెట్లోకి అడుగుపెట్టడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీనిపై ఆయన అభిమానులు, నెటీజన్లు స్పందిస్తూ గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ పెడుతున్నారు.