దేవర మూవీ సెకండ్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే ?

ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న దేవర ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఈ నెల 5న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది

By :  Vamshi
Update: 2024-08-02 13:08 GMT

యంగ్ టైగర్ జునియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా కొరటాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం.. దేవర ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఈ నెల 5న రిలీజ్ చేయనున్నట్లు సినీ యూనిట్ ఓ పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఎన్డీఆర్ న్యూ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ లో జాన్వీ క‌పూర్‌ చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ విల‌న్ గా న‌టిస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల చేయనున్న‌ట్లు మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కొర‌టాల శివ, తారక్ ఇద్ద‌రి కాంబోలో ఇంత‌కు ముందు వ‌చ్చిన 'జ‌న‌తాగ్యారేజ్' సూప‌ర్ హిట్ కావ‌డంతో దేవ‌ర‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ మూవీ పోస్ట‌ర్స్, ఫ‌స్ట్ సింగిల్, టీజ‌ర్ ల‌కు మంచి స్పంద‌న‌ ద‌క్కింది.

Tags:    

Similar News