‘గద్దర్’ అవార్డుల కమిటీ చైర్మన్ గా బి. నర్సింగ్ రావు

నంది స్థానంలో గద్దర్ పేరుతో సినీ అవార్డులు ప్రదానం చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

Update: 2024-08-22 16:08 GMT

గద్దర్ పేరుతో సినీ అవార్డులు ప్రదానం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గద్దర్ అవార్డుల విధివిధానాలు, లోగో, ఇతర నిబంధనలు రూపొందించడానికి ప్రఖ్యాత దర్శకుడు బి. నర్సింగ్ రావు చైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి వైస్ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజును నియమించింది. అడ్వైజరీ మెంబర్లుగా కె. రాఘవేంద్రరావు, అందె శ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అర్వింద్, గద్దర్ కుమార్తె వెన్నెల, తనికెళ్ల భరణి, డి. సురేశ్ బాబు, చంద్రబోస్, ఆర్. నారాయణ మూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణు ను నియమించారు. ఎఫ్ డీసీ ఎండీ మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది పేరుతో సినీ, టీవీ అవార్డులను ప్రతి ఏటా ప్రకటించేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ అవార్డుల ప్రదానం ఆగిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ పేరుతో సినీ, టీవీ అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలోనే కమిటీని ఏర్పాటు చేశారు.




 


Tags:    

Similar News