యోగా, ధ్యానంతో ఏకాగ్రత పెరుగుతుంది: ప్రధాని

నేడు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు ఒడ్డున యోగా దినోత్సవం పాల్గొన్నారు. యోగా, ధ్యానంతో ఏకాగ్రత పెరుగుతుందన్నారు.

యోగా, ధ్యానంతో ఏకాగ్రత పెరుగుతుంది: ప్రధాని
X

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు ఒడ్డున యోగా దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా ప్రాముఖ్యాన్ని అనేక దేశాల నేతలు నన్ను అడగారు. యోగా ప్రాముఖ్యం రోజురోజుకూ పెరుగుతున్నది. యోగా ఇవాళ కోట్ల మందికి దైనందిన కార్యక్రమమైందన్నారు. విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదన్నారు. దీన్ని నేర్పడానికి వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని తెలిపారు. యోగా, ధ్యానంతో ఏకాగ్రత పెరుగుతుందన్నారు.ప్రపంచ యోగా గురుగా భారత్‌ మారింది. యోగా వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయన్నారు. జమ్ముకశ్మీర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 వేల మంది పాల్గొన్నారు. జర్మనీలో కోటిన్నరమంది నిత్యం యోగా చేస్తున్నారు. యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది. మన దేశంలో అనేక యూనివర్సిటీలు ప్రారంభించాయని ప్రధాని తెలిపారు. షేర్‌-ఏ-కశ్మీర్‌ సమావేశ కేంద్రం వద్ద ప్రధాని యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీ, ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొని యోగాసనాలు వేశారు.వివిధ ప్రతికూల ప్రాంతాల్లో భారత సైనికులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.

Raju

Raju

Writer
    Next Story