మళ్లీ మనకు 'గుండు సున్నా'నే: కేటీఆర్‌

కేంద్ర బడ్జెట్‌లో మనకు మళ్లీ దక్కేది 'గుండు సున్నా'నే అని కేటీఆర్‌ వ్యంగ్యంగా అన్నారు.

మళ్లీ మనకు గుండు సున్నానే: కేటీఆర్‌
X

నరేంద్రమోడీ 3.0 ప్రభుత్వం నేడు బడ్జెట్‌ ప్రవేశపెట్టన్నది. 2024-25 సంవత్సరానికి మిగిలిన 8 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత సాధించబోతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తారా? పెండింగ్‌ ప్రాజెక్టులకు పూర్తి నిధులు కేటాయిస్తారా అనే చర్చ జరుగుతున్నది ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. బడ్జెట్‌పై మీ అంచనాలు ఏమిటి అన్న ఒక జర్నలిస్టు ప్రశ్నకు సమాధానంగా.. గత పదేళ్లుగా మనకు కేంద్రం నుంచి ఏదైతే వచ్చిందో ఈసారి కూడా అదే పునరావృతమౌతుందని 'గండు సున్నా'అని వ్యంగ్యంగా చెప్పారు.





ఎన్డీఏ1, 2 రెండు దఫాల్లో సంస్కరణలకే పెద్ద పీట వేసిన ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకే నిధులు కేటాయించిందనే విమర్శలున్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. సామాన్యులకు, వేతన జీవులకుబడ్జెట్‌లో ఊరట దక్కుతుందా? రైతులు, మహిళలు, ఉద్యోగులకు వరాలిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ బడ్జెట్‌లో అయినా పన్నులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారేది ఆసక్తికరంగా ఉంటుంది. వ్యక్తిగత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు ఉంటాయి? వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో ప్రవేశపెట్టనున్న ఈ సారి బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి వరాలు ఇస్తారా? చర్చ జరుగుతున్నది.

Raju

Raju

Writer
    Next Story