అలిపిరి దాడి నుంచి వెంకన్న స్వామి బతికించారు : చంద్రబాబు

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న బాబు

Chandrababu
X

తిరుమలలో 2003లో తనపై జరిగిన బాంబు దాడి ఘటన నుంచి వెంకటేశ్వర స్వామి తనను రక్షించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తను చిన్నప్పటి నుంచి శ్రీవారి భక్తుడేననీ చెప్పారు. ప్రతి రోజు ఆయన్ను తలుచుకొని పనులు ప్రారంభిస్తానని బాబు తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. ఈమేరకు ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా తొలిసారి మీడియతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక గెలుపున్నారు.

రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇంత స్పష్టంగా, 93 శాతం సీట్లతో ఏ ఎన్నికలలోనూ ప్రజలు తీర్పు ఇవ్వలేదని చెప్పారు. ఇదంతా తిరుమల శ్రీవారి దయేనని చెప్పుకొచ్చారు. అలిపిరిలో తనపై జరిగిన దాడిని గుర్తుచేసుకున్న చంద్రబాబు.. నాడు తనను కాపాడింది వెంకటేశ్వరుడేనని వివరించారు. దర్శనానికి వస్తుండగా తన ప్రాణం పోతే ఆయనపైనే నింద పడుతుందని అనుకున్నారో లేక తన వల్ల జరగాల్సిన పనులు ఉన్నాయనో బతికించాడని చెప్పారు. తెలుగు జాతికి తాను సేవ చేయాల్సి ఉందనే కాపాడాడని అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story