హైదరాబాద్‌లో కుండపోత వర్షం

హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్‌.. హైదరాబాద్‌, రంగారెడ్డి పరిధిలోని విద్యాంస్థలకు సెలవు

హైదరాబాద్‌లో కుండపోత వర్షం
X

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో చాలా ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీటి ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి డీఈవోలు ఈ మేరకు ప్రకటన జారీ చేశారు.

ఇవాళ కూడా భారీ వానలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది. ఈ రోజు ఉదయం 10.30 గంటల వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని ఆ తర్వాతే కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.

దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్‌, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్‌ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, బిఎన్‌ రెడ్డి నగర్, హయత్‌నగర్‌, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం మంగళవారం వేకువజామును మరోసారి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం పడుతున్నది. ఎడతెరిపి లేని వర్షాలకు లోట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో జీహెచ్‌ఎంపీ, విపత్తు నిర్వహన సిబ్బంది అప్రత్తమైంది. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టింది. అనవసరంగా ఎవరూ బైటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే ట్రోల్‌ ఫ్రీ 040-21111111, 9000113667కాల్‌ చేయాలని సూచించారు.

పంజాగుట్టలో పిడుగు పాటకు కారు ధ్వంసమైంది.షెడ్డుపై పిడుగు పడి కారు ధ్వంసం, తెగిపడిన విద్యుత్ తీగలు జవహర్‌నగర్‌, పాపయ్యనగర్‌: సంతోష్‌నగర్‌లలో ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. జవహర్‌నగర్‌లోని పలు కాలనీలలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.





పార్శిగుట్టలో వర్షపు నీటిలో ఓ వ్యక్తి వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. . మృతుడు రామ్‌నగర్‌కు చెందిన అనిల్‌గా గుర్తించారు. భారీ వానకు సికింద్రాబాద్‌లోని సనత్‌ నగర్‌ నుంచి వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. పార్శిగుట్టలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి కార్లు కొట్టుకుపోయాయి. భారీ వరదతో పార్శిగుట్టలోని పలు ప్రాంతాలు ప్రమాదం అంచులో ఉన్నాయి.ముషీరాబాద్‌, రాంనగర్‌, బౌద్ధనగర్‌ ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా చేరింది. న్యూబోయిన్‌పల్లి హర్షవర్ధన్‌ కాలనీలో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది.కుత్భుల్లాపూర్‌లోని వెంకటేశ్వరనగర్‌, ఇందర్‌సింగ్‌ నగర్‌, వాణి నగర్‌లలో కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రశాంతి నగర్‌ వద్ద నాలా పొంగి రోడ్లపైకి వరద ప్రవహిస్తున్నది. మలక్‌ పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Raju

Raju

Writer
    Next Story