మండలానికొకటి అన్నారు.. నియోజకవర్గానికి ఒకటేనట?

ఇంటర్నేషనల్ రెసిడెన్సియల్ స్కూల్స్‌ నుంచి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వైపు యూటర్న్‌

మండలానికొకటి అన్నారు.. నియోజకవర్గానికి ఒకటేనట?
X

కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ రెసిడెన్సియల్ స్కూల్స్‌ నుంచి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వైపు యూటర్న్‌ తీసుకున్నది. ప్రభుత్వ పాఠశాలలో అన్నివర్గాల వారు ఒకే చోట చదువుకోవాలని, కానీ గురుకులాల వల్ల సమాజంలో కులాల వారీగా చీలిక వచ్చింది అని ఆరోపించింది. నిజానికి ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు ఎప్పటి నుంచో ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ గురకుల పాఠశాలలను పెంచుతూ అదనంగా బీసీ, మైనార్టీ పాఠశాలలను ఏర్పాటు చేసింది. వాటిని దశలవారీగా అప్‌గ్రేడ్‌ చేస్తూ డిగ్రీ వరకు తీసుకెళ్లింది. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హామీలో భాగంగానే వీటిని ఏర్పాటు చేసింది. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు బలోపేతానికి చర్యలు తీసుకున్నది. వీటికంటే ముఖ్యమైనది. విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కేసీఆర్‌ ఏం చేసినా దానిని ధ్వంసం చేయాలనే కుట్ర రేవంత్‌ ప్రభుత్వం చేసింది. ఈ ఏడు నెలల పాలలో వారు తీసుకున్న విధాన నిర్ణయాలు చూస్తే ఇదే అర్థమౌతుంది.

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్సియల్‌ స్కూల్స్‌ విషయంలోనూ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి. సీఎం రేవంత్‌ గతంలో ఒక మీడియా ఛానల్‌లో మాట్లాడుతూ.. ప్రజలు అబద్ధాలు చెప్తేనే విశ్వసిస్తారని, మా నుంచి అదే కోరుకుంటున్నారు అన్నట్టు మాట్లాడారు. నాడు అన్నట్టే అధికారంలోకి వచ్చాక ఆయన కాంగ్రెస్‌ ఇచ్చిన అన్ని హామీలపై యూటర్న్‌ తీసుకుంటున్నారు. కొడంగల్‌లో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని దీనికోసం రూ. 75 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ కాదు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు. రేవంత్‌ ప్రభుత్వ అన్నీయూటర్న్‌లే. మండలానికి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అన్న రేవంత్‌ సర్కార్‌ ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటే అనే సంకేతాలు ఇస్తున్నది. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్‌ స్థాయి విద్యను అందించే స్కూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. కానీ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో 7-8 మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం యోచిస్తున్నట్టు నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎవరికైతే నాణ్యమైన విద్య అవసరమో వాళ్లకే విద్యను దూరం చేసే ప్రయత్నం రేవంత్‌ ప్రభుత్వం చేస్తున్నట్టు వారి చర్యల ద్వారా తెలుస్తోంది.





ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నది. దీనికి సంబంధించి ఆర్కిటెక్చర్స్ రూపొందించిన పలు నమూనాలను సీఎం, డిప్యూటీ సీఎం పరిశీలించారు. ప్రభుత్వం ఒకేచోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నది. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ గా కొడంగల్, మధిర నియోజవర్గాల్లో ఏర్పాటు చేయనున్నది. ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో 20 ఎకరాల చొప్పున స్థలాన్ని సేకరించింది.

Raju

Raju

Writer
    Next Story