కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపం.. కేటీఆర్ ట్వీట్

కేంద్రం అస‌మ‌ర్థ‌త విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు పొంత‌న లేకుండా పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ktr2
X

కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ నిర్ణయాలకు పొంతన లేకుండా పోయిందన్నారు. నీట్ పేపర్ లీకైనా..కేంద్రం జులై 6న నుంచి కౌన్సింగ్ నిర్వహిస్తుందని ఆయన మండిపడ్డారు. ఎలాంటి కారణాలు చూపకుండా నీట్ ఎగ్జామ్ వాయిదా వేశారని విమర్శించారు. దీని అంతటికి కారణం నేషనల్ డిజాస్ట్రర్ అలయన్స్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. జూన్ 4న నీట్ యూజీ పరీక్ష లీక్ అయిందని... జూన్ 19న పరీక్షను క్యాన్సిల్ చేశారని తేదీలతో పాటు పేర్కొన్నారు.

జూన్ 21న సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పోస్ట్ పోన్ చేశారని పేర్కొన్నారు. జూన్ 22న నీట్ పీజీటీని చివరి నిమిషంలో పోస్ట్ చేసినట్లు ట్వీట్‌లో తెలిపారు .దేశంలో జరుగుతున్న పోటీ పరీక్షల నీట్, యూజీసీ-నెట్‌లలో అవకతవకలు జరిగాయన్న వివాదం ఆగేలా కనిపించడం లేదు. ఒకవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను శనివారం ఆ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. మరోవైపు జూన్ 23న జరగాల్సిన నీట్-పీజీ పరీక్షనుకూడా వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సుబోధ్ సింగ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ల్ ఉంచినట్లు ఓ అధికారి తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story