మంత్రి కొండా మాట్లాడుతుండగానే పోయిన కరెంట్‌

కరెంట్ కోతలు మంత్రులను వెంటాడుతున్నాయి. హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుండగా కరెంటు పోయింది.

మంత్రి కొండా మాట్లాడుతుండగానే పోయిన కరెంట్‌
X

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరెంటు కోతలు మొదలయ్యాయి. కానీ ప్రభుత్వం మాత్రం వీటిని కొట్టిపారేస్తూ 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెబుతున్నది. కానీ దీనికి భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. వానలు పడినా, చిన్నగా గాలులు వచ్చినా గంటల తరబడి కరెంటు పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదానికి పొంతన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పోతున్న కరెంటు గురించి ప్రజల నుంచి వస్తున్న విమర్శలకు విద్యుత్‌ శాఖ సరైన సమాధానం చెప్పలేకపోతున్నది.

ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలలోనే కరెంటు పోయిన దృశ్యాలు అనేకం ఇటీవల కాలంలో జరిగాయి. ఈ నేపథ్యంలోనే హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రి కొండా సురేఖ ప్రెస్‌మీట్‌ మాట్లాడుతుండగా కరెంట్‌ పోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు సెటైర్లు వేస్తున్నారు. కరెంటు పోవడం లేదంటున్న ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్‌ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే ఉన్న విషయం చెబితే నష్టమేమీ ఉండదు. కానీ కండ్లముందే కరెంటు పోయినా పోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తుండటంపైనే విమర్శలు వస్తున్నాయి.

Raju

Raju

Writer
    Next Story