అమరరాజా వెళ్లిపోతే తెలంగాణకు తీవ్ర నష్టం : కేటీఆర్‌

తెలంగాణలో రూ. 9500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకుగాను అమర్‌రాజాను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.

KTR
X

రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బ్రాండ్ దెబ్బతినకూడదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ నుంచి అమరరాజా వెళ్లి పోతానడడంపై కేటీఆర్ ఎక్స్ ద్వారా పోస్ట్‌ చేశారు. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ నుండి వెళ్ళిపోతామని ప్రకటించారట అమర రాజా చైర్మన్ జయదేవ్ గల్లా. తెలంగాణలో బీఆర్‌ఎస్ హయాంలో అమర రాజా కంపెనీకి చేసిన హామీలను రేవంత్ ప్రభుత్వం నెరవేర్చకపోతే, మేము మా ప్లాంట్ కోసం వేరే చోట వెతకవలసి ఉంటుందని తెల్చి చెప్పారు. తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజును ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని కేటీఆర్ అన్నారు.

అమరరాజా ఇప్పుడు వెళ్లిపోతే తెలంగాణకు తీవ్ర నష్టం అన్నారు. తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజును ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని….అలాంటి కంపెనీకి ఇచ్చిన హామీలు అమలు చేయండి అని రేవంత్‌ రెడ్డిని కోరారు. కేన్స్ టెక్నాలజీ తెలంగాణ నుండి గుజరాత్‌కు వెళ్లిపోవడం, కార్నింగ్ ప్లాంట్‌ను చెన్నైకి పోగొట్టుకోవడం, అమరరాజా ఇప్పుడు వెళ్లిపోతే అది విపత్తు అని కేటీఆర్‌. హెచ్చరించారు. తెలంగాణ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన, శక్తివంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉందని కేటీఆర్ తెలిపారు.

కానీ, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులతో సమానం అంటూ ముఖ్యమంత్రి హాస్యాస్పద ప్రకటనలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణను వదిలి గుజరాత్‌కు వెళ్లిపోయిందని, కార్నింగ్ ప్లాంట్‌ను చెన్నైకి తరలిపోయిందని అన్నారు. ఇక అమర‌రాజా కూడా వెళ్లిపోతే అది తెలంగాణ పారిశ్రామిక రంగానికి వచ్చి విపత్తులాగే తాము భావిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story