బీఆర్‌ఎస్‌‌ను తెలంగాణ కోరుకుంటోంది : కేసీఆర్

తెలంగాణ కోసం ఉద్యమం సమయంలో ఎన్నో పరిస్థితులు తట్టుకొని నిలబడ్డామని... ఇప్పటి పరిస్థితులు ఒక లెక్కే కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

బీఆర్‌ఎస్‌‌ను తెలంగాణ కోరుకుంటోంది : కేసీఆర్
X

తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కష్టలు తట్టుకొని నిలబడ్డామని ఇప్పుడున్న పరిస్థితులు ఒక లెక్కే కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లి నివాసంలో తనను కలిసేందుకు మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన కార్య కార్యకర్తలు నాయకులతో గులాబి బాస్ సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ విజయ ప్రస్ధానంలో లోక్ సభ ఎన్నికల్లో ఓటమి దిష్టి తీసినట్లైందన్నాకరు. రెండు దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుత విజయాలే దక్కాయన్నారు. జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి పబ్బం గడుపుతోందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేశామని ప్రజలకు అర్థమైందన్నారు. బీఆర్ఎస్‌ను తెలంగాణ సమాజం తిరిగి కోరుకుంటోందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామన్నారు. గెలుపోటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందన్నారు. హస్తం పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేశామని భావిస్తున్నారన్నారు. కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న రేవంత్ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగబడే రోజులు వస్తాయన్నారు.తెలంగాణను అష్ట దిగ్భందనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు.. వాళ్లు రాసిందే రాత గీసిందే గీతగా నడిచేదని గుర్తుచేశారు.



అత్యంత శక్తివంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుంటూ, తెలంగాణ వ్యతిరేకతకు, సమైక్యవాదానికి సింబాలిక్‌గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబు నాయుడును ఎదిరించి నిలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. అలాంటి సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగాణను సాధించి.. కలబడి నిలబడిన తెలంగాణ సమాజం, భవిష్యత్తులో ఎలాంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. ‘మరికొద్ది రోజుల్లోనే టార్చ్‌లైట్ పట్టుకొని జనం దోలాడుకుంటా బీఆర్ఎస్ పార్టీకోసం వస్తారని’ కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ, అప్పడిదాక ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

Vamshi

Vamshi

Writer
    Next Story