రేవంత్‌ ఫామ్ హౌజ్ ఎక్కడుందో చూపిస్తా : కేటీఆర్

నాకంటూ ఎలాంటి ఫార్మ్ హౌస్ లేదన్నారు కేటీఆర్‌. నా మిత్రుడి ఫార్మ్ హౌస్‌ను నేను లీజుకు తీసుకున్నాను….ఎఫ్.టి.ఎల్ లో వుంటే నేనే దగ్గర ఉండి ఫార్మ్ హౌస్ ను కూలగొట్టిస్తానని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

రేవంత్‌ ఫామ్ హౌజ్ ఎక్కడుందో చూపిస్తా : కేటీఆర్
X

నాకు ఎలాంటి ఫార్మ్ హౌస్ లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నా స్నేహితుడి వ్యవసాయ క్షేత్రాన్ని నేను లీజుకు తీసుకున్నారు. బఫర్ జోన్‌లో ఉంటే నేనే దగ్గర ఉండి కూలగొట్టిస్తానని తెలిపారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హస్తం నేతలు కె.వి.పి రామచంద్రారావు, పట్నం మహేందర్‌రెడ్డి, గుత్త సుఖేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్‌లను కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫార్మ్ హౌస్ నుండి స్టార్ట్ చేద్దామన్నారు.

వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ నీళ్ళల్లో ఉందన్నారు. నా అఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లో ఉందని చెప్పారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోండి అంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల నుండి మొదలు పెట్టండన్నారు రేపు చేవెళ్లలో జరిగే రైతు నిరసన కార్యక్రమంలో నేను పాల్గొంటానని ప్రకటించారు కేటీఆర్‌. రైతులకు రుణమాఫీ,రైతు భరోసా ఇచ్చే వరకు వెంట పడుతాము.. రైతుల పై కేసులు ఉపసంహరించుకోండన్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నవి అర్థసత్యాలు, అసత్యాలన్నారు. రుణమాఫీకాదని.. రైతులకు కుచ్చు టోపీ అని మండిపడ్డారు. రూ.2 లక్షలు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల చెప్పారు. రుణమాఫీపై ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారని.. రుణమాఫీపై రైతులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పూర్తిగా రుణమాఫీ కాలేదన్నారు . కోస్గి ఉమ్మడి మండలంలో 20,239 రైతు ఖాతాలు ఉన్నాయని అందులో కేవలం 8,527 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని జాబితాను కేటీఆర్ చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ ఆందోళనలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, బజారు భాష, చిల్లర భాషతో తాము పక్కదారి పట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ఫామ్ హౌజ్ ఎక్కడుందో తాను చూపిస్తానని, పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు ఫామ్ హౌజ్‌లు ఉన్నాయని.. తనకు మాత్రం లేదన్నారు. ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌజ్ ఎఫ్‌టీఎల్ లిమిట్స్‌లో ఉందని, ఇప్పటికే ఆయన సోదరుడు అక్కడే ఉంటున్నాడని కేటీఆర్ అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story