ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు

టోల్ ప్లాజా మార్గాలలో నడిచే బస్సుల్లో టికెట్ రూ.3 పెంపు

Rtc charge hike
X

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చింది ఆర్టీసీ సంస్థ. భారీగా ఆర్టీసీ టికెట్ ధరలను పెంచేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇటీవల టోల్ ప్లాజాల రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. టోల్ ప్లాజా లు ఉన్న మార్గాలలో నడిచే బస్సుల్లో… టికెట్ చార్జీలోని రుసుమును ఆర్టీసీ మూడు రూపాయల చొప్పున పెంచేసింది. కేంద్రం ఇటీవల టోల్ చార్జీలు పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఈ లెక్కన కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చింది టీఎస్ ఆర్టీసీ సంస్థ. భారీగా ఆర్టీసీ టికెట్ రేటులను పెంచేసింది రేవంత్ సర్కార్. ఇటీవల టోల్ ప్లాజాల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. తాజగా టోల్ ప్లాజాలున్నా రూట్లో నడిచే బస్సుల్లో టికెట్ ఛార్జీలోని టోల్ రుసుమును రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్‌లో ₹10 నుంచి ₹13కు, డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో ₹13 నుంచి ₹16కు, గరుడ ప్లస్‌లో ₹14 నుంచి ₹17కు, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్‌‌లో ₹15 నుంచి ₹18కి, AC స్లీపర్‌లో ₹20 నుంచి ₹23కు పెంచింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించే టి-24 టికెట్ ధరలు పెరిగాయి. వీటి ధరలను పెంచుతూ టిఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్ ధర సాధారణ ప్రయాణికులకు రూ.90 నుంచి రూ.100కి పెంచారు. ఇక సీనియర్ సిటిజన్లకు టికెట్ ధర ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90కి పెంచారు.

Vamshi

Vamshi

Writer
    Next Story