ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు సిగ్గుపడుతున్నం

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రేవంత్‌ ప్రభుత్వం నాటి సమైక్య పాలనను తలపించే విధంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తూ చీకట్లలో అభ్యర్థులను బంధించింది.

ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు సిగ్గుపడుతున్నం
X

నిర్బంధాలతో, అర్ధరాత్రి వరకు పోలీస్‌ స్టేషన్లలో పెట్టి నిరుద్యోగులను అణిచివేసే ప్రయత్నం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నది. విద్యాశాఖ ముట్టడికి వెళ్లిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఠాణాల్లో ఎండలోనే కూర్చెబెట్టారు. కనీసం వారికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. సాయంత్రం కాగానే మొత్తం లైట్లు బంద్‌ పెట్టి టెర్రర్‌ క్రియేట్‌ చేశారు. డీఎస్సీని వాయిదా వేయాలని కోరినందుకు కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన బహుమతి.

నిన్న ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు విచక్షణ కూడా చూపెట్టలేదని, నిరుద్యోగులువారి కాళ్లపై పడినా కనికరించలేదు. పదేళ్ల పాలనలో ఎన్నడూ ఇంత నిర్బంధాన్ని చూడలేదని నిరుద్యోగులు చెప్పారు. పోలీసుల తీరు చూశాక రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పాలనలో ఉన్నామో తెలుస్తున్నది అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేసినందుకు సిగ్గుపడుతున్నామన్నారు. నిరుద్యోగులపై రేవంత్‌ ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజా పాలన అని, పదేళ్ల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ వచ్చింది అంటే ఇదేనా ప్రశ్నించారు.

సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో నిరుద్యోగులు పడుతున్న అవస్థలు చూడలేక అక్కడి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లైట్లు బందు పెట్టి ఇంత అరాచకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు క్రిషాంక్‌కు నచ్చజెప్పి పంపించారు. అనంతరం డీఎస్సీ అభ్యర్థులు ర్యాలీగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లారు. ఆర్ట్స్‌ కాలేజీ ముందు అర్ధరాత్రి వరకు శాంతియుత నిరసనలు చేపట్టారు. విద్యార్థి నేతలకు మద్దతుగా రాకేశ్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండటమే కాకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నదని విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెట్‌కు డీఎస్సీకి మధ్య నెల రోజుల వ్యవధి లేదు, డీఎస్సీ కంటే ముందు డీఏవో, హాస్టల్‌ వెల్ఫేర్‌ వంటి పరీక్షలు జరిగాయి. అలాగే ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో చదవుకోవడానికి డీఎస్సీని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరీక్షలకు ప్రిపేర్‌ కావాలంటే ఏకాలంలో సాధ్యం కాదని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతున్నారు. పోస్టులు పెంచమంటే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించకున్న ప్రభుత్వం తన పరిధిలో ఉన్న ఒక న్యాయమైన డిమాండ్‌పై నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకోకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు.

అలాగే గతంలో ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీ సిలబస్‌ను రూపొందించాని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అంత సిలబస్‌ గ్రూప్‌-1 లో కూడా లేదని వారు వాపోతున్నారు. టెట్‌ వరకే ఉన్న సైకాలజీ, ఫిలాసఫీని డీఎస్సీలో పెట్టారు. అయితే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇట్లా అడ్డగోలుగా సిలబస్‌ మార్చినా అవన్నీ చదువుకోవాలంటే మాకు కొంత సమయం కావాలని నిరుద్యోగులు కోరుతున్నారు. వరుస పరీక్షలతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని మా అభ్యర్థలను ప్రభుత్వం పట్టించుకోకపోగా, పాశవికంగా మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నదని నిరుద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏండ్ల తరబడి చదివిన మాకు ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వకుండా మమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నది. ఇది తట్టుకోలేక ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తున్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగుల డిమాండ్‌ మేరకు డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలన్నారు. లేకపోతే రానున్న రోజుల్లో ఈ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Raju

Raju

Writer
    Next Story