25 మందితో రెండో జాబితా

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్‌ ఛైర్మన్లపై అసంతృప్తి కొనసాగుతూనే ఉండగా.... మరో 25 కార్పొరేషన్‌ పదవులు భర్తీ చేసేందుకు కసరత్తు మొదలైంది.

25 మందితో రెండో జాబితా
X

రాష్ట్రంలో నిన్న 35 కార్పొరేషన్ల కొత్తగా ఛైర్మన్‌ పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొదటి విడుతలో 37 మంది పదవులు ఇచ్చింది. అనర్హులు ప్రాధాన్యం ఇచ్చారని, తమకు అప్రధాన పోస్టులు ఇచ్చారని మొదటి జాబితాపైనే అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు ఈ విషయంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కొల్లాపూర్‌ టికెట్‌ ఆశించిన జగదీశ్వర్‌రావు తనకు ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టును స్వీకరించడానికి నిరాకరించారు. దీంతో సీఎం రేవంత్‌ ఆయనతో మాట్లాడి వేరే పదవి కట్టబెడుతామని మామీ ఇచ్చారు. ఈ మేరకు అసంతృప్తులకు, అవకాశాలు రాని వారికి రెండో జాబితాలో పదవులు ఇవ్వడానికి రాష్ట్ర నాయకత్వం రంగం సిద్ధం చేసింది.

రెండో విడతలో మరో 25 మందికి ఛైర్మన్‌ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాబితా సిద్ధం చేసింది. ఇప్పుడు నియామకమైన ఛైర్మన్‌ల్‌తో కలిసి పనిచేయడానికి డైరెక్టర్లను, సభ్యులను నియమించడానికి రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌ మున్షితో కలిసి కసరత్తు మొదలుపెట్టారు. సుమారు 200 మందిని డెరెక్టర్లు, సభ్యులుగా నియమించడానికి వారం పదిరోజుల్లో ఈ జాబితా సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి పదవులన్నీ రేవంత్‌ చెప్పిన వారికే ఇస్తారని స్పష్టమౌతున్నది. ఎందుకటే మొదటి జాబితో అనర్హులకు చోటు దక్కడానికి ఆమె కారణమని, ఎన్నికల వరకే ఇక్కడ ఉండాల్సిన ఆమె ఒక కోటరీ పెంచిపోషిస్తూ ఇక్కడే మకారం వేశారనే విమర్శలున్నాయి. దీంతో మొదటి జాబితాపై పెద్ద రచ్చ జరిగింది. ఇక రెండో జాబితా ప్రకటిస్తే ఏమౌతుందో చూడాలి.

ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల వైఎస్‌ఆర్‌టీపీలో తనతో పనిచేసిన అనుచరుడికి ఒక పదవి కోరుతున్నారని సమాచారం. ఆమె విజ్ఞప్తి మేరకు సీఎం ఒక ఛైర్మన్‌ పదవి ఇవ్వడానికి అంగీకరించారట. ఇక 25 మంది జాబితా వెంటనే ప్రకటిస్తారా లేక పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి వర్గ విస్తరణతో పాటు భర్త చేస్తారా? అన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. లోక్ సభ ఎన్నికలకు ముందు నుంచి ఈ పదవుల కోసం ఎదురుచూస్తున్న నిన్న ప్రకటించిన కార్పొరేషన్‌ ఛైర్మన్‌లో కొంతమంది బాధ్యతలు చేపట్టారు.

Raju

Raju

Writer
    Next Story