కాంగ్రెస్ హై కమాండ్ కే రేవంత్ సుద్దులు

రాగం.. తాళం.. పల్లవి!! అన్నీ సీఎం కుర్చీ కోసం.. కుర్చీ వల్ల.. కుర్చీ చేత.. అప్పుడే జైపాల్ రెడ్డిని సీఎం అంటే 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదట

కాంగ్రెస్ హై కమాండ్ కే రేవంత్ సుద్దులు
X

రేవంత్‌రెడ్డి ఏ వేదికపై మాట్లాడినా 'సీఎం' ముచ్చటే. తనను సీఎం సీట్లో కూర్చోబెట్టిన అధిష్ఠానానికే రేవంత్‌ సుద్దులు చెప్పవట్టే. జైపాల్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడం వల్లనే 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదంటరు. పార్టీలో దశాబ్దాల పాటు పార్టీలో ఉన్న సీనియర్లను కాదని ఆయనను సీఎం చేసిన ఫలితం...

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చింది 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు. అప్పటికి ఆయన తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఆయన ఏ సభలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జైపాల్‌రెడ్డి వర్ధంతి సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠాన విధాన నిర్ణయ లోపం వల్లనే 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదన్నారు. సీఎం వ్యాఖ్యలు చూస్తే ఆయన ఏ పార్టీలో ఆ మాట మాట్లాడుతారు. అందులో నుంచి బైటికి వచ్చాక ఆయన వ్యాఖ్యలనే నాలుక మడతేసి తాను విమర్శించిన పార్టీపైనే ప్రశంసలు కురిపిస్తారు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అనడానికి సీఎం వ్యాఖ్యలే ఉదాహరణగా చెప్పుకోవచ్చనే విమర్శలు ఉన్నాయి. అబద్ధాలు, అడ్డదిడ్డమైన మాటలు, తాను మాట్లాడిన, ఇచ్చిన హామీలకు ఎన్నడూ కట్టుబడి ఉండరు అని ఈ ఎనిమిది నెలల కాలంలోనే సీఎం మాటలు చూసిన వారిందరికీ అర్థమౌతున్నది. 2014లో టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరుకున్నారని ఆయన కల్వకర్తి సభలో చేసిన కామెంట్ల బట్టి తెలుస్తోంది.

జైపాల్‌రెడ్డికి పదవులతో గౌరవం రాలేదని.. ఆయన వల్లే పదవులకు గౌరవం వచ్చింని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొట్రా చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా రెండో విడుత రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే తాను ఆగస్టు 2 నుంచి 14వ తేదీ వరకు అమెరికా పర్యటకు వెళ్తున్నానని.. వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీని ఆగస్టునెలాఖరులోగా చేస్తానని చెప్పారు.

రుణమాఫీపై ప్రభుత్వం పెట్టిన కండీషన్లు, మొదటి విడత రుణమాఫీ తర్వాత రైతుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతున్నది. ఏక కాలంలో ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తానన్న మాటలూ బోగసే అని ఇప్పటికే తేలిపోయింది. ఇప్పుడు మూడు విడతల్లో రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని రేవంత్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

మరో మూడు రోజుల్లో స్కిల్‌ వర్సిటీకి శంకుస్థాపన: సీఎం

మరో మూడు రోజుల్లో ముచ్చెర్లలో 50 ఎకరాల్లో 100 కోట్లతో స్కిల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. కల్వకుర్తిలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌, రోడ్ల కోసం రూ. 180 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఆమన్‌గల్‌కు డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామన్నారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు ఫోర్‌లైన్స్‌ రోడ్లు తెస్తామని సీఎం తెలిపారు. తాను చదువుకున్న తాండ్ర హైస్కూల్‌ అభివృద్ధికి రూ 5 కోట్లు మంజూరు చేస్తున్నానని చెప్పారు. కల్వకుర్తిలో నిరుద్యోగం పారదోలడానికి స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలో అండర్‌ అండర్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తల ఎన్నికలని, పార్టీ కోసం కష్టపడిన వారందరినీ తనతో పాటు ఇతర ప్రజాప్రతినిధులంతా గెలిపించే బాధ్యత తీసుకుంటానని సీఎం తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story