బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న : కేటీఆర్

తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న : కేటీఆర్
X

తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారి కృషిని, పట్టుదలను, వారు పోషించిన చారిత్రక పాత్రను ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన తరుణమిదని కేటీఆర్ తెలిపారు.

కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం ఎంతో గొప్ప విషయమని ఆయన సేవలు కోనియాడరు. విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వ హించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంతోపాటు, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు

Vamshi

Vamshi

Writer
    Next Story