పేకాట క్లబ్‌లు బార్లా?

ఇక పేకాడుకుందాం రా !

Pekata club
X

పేకాట ఓ వ్యసనం. జూదం మోజులోపడి ఆస్తులు పోగొట్టుకుని సరస్వం కోల్పోయన వారు ఎందరో. ఈ కారణంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేకాట క్లబ్‌లపై పూర్తిగా నిషేధం విధించాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన పేకాట విచ్చల విడిగా కొనసాగుతుంది. పోలీసు యంత్రాగం, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.పేకాట ఎంతటి వ్యసనమో, ఎన్ని కుటుంబాలను నాశనం చేసిందో సమాజంలో అందరికీ తెలిసిందే. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ పేకాట క్లబ్బులను కఠినంగా మూసివేయించారు. ఎన్ని రకాల వత్తిళ్లు వచ్చినా ఈ విషయంలో గత పదేళ్లుగా వెనక్కిపోలేదు.

ప్రస్తుతం నడుస్తున్న ఆన్ లైన్ గేములతో జరుగుతున్న అనర్ధాలు, ఆత్మహత్యలు అందరం చూస్తూనే ఉన్నాం. అందుకే కేసీఆర్ సామాన్య, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని పేకాటకు అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం తెలంగాణలో పేకాట క్లబ్ లను తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు షురూ అయ్యాయి. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న రిక్రియేషన్ క్లబ్ లో 13 కార్డుల రమ్మీ/సిండికేట్ గేమ్ అనుమతి కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. దీని మీద వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ, న్యాయశాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, నగర పోలీస్ కమీషనర్లకు నాలుగు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.

రమ్మీ నైపుణ్యంతో కూడిన ఆటల పరిధిలోకి రాదని పోలీసులు తెలంగాణలో దానిని నిషేధించారని, ఇక్కడ 1020 మంది మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, న్యాయవాదులు, డాక్టర్లు, జడ్జీలు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, బిల్డర్లు, వ్యాపారులు ఉన్నారని, తాము ఎలాంటి రుసుము వసూలు చేయడం లేనందున అవకాశం ఇవ్వాలని ఓ పిటీషనర్ పేర్కొనడం గమనార్హం. గత పదేళ్లుగా తెలంగాణలో పేకాటను కేసీఆర్ కట్టడి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే త్వరలోనే తెలంగాణలో మూడు పేకలు, ఆరు క్లబ్బులను చూడొచ్చు.

Vamshi

Vamshi

Writer
    Next Story