పోచారం లక్ష్మి పుత్రుడు కాదు లంక పుత్రుడు: మాజీ ఎమ్మెల్యేజీవన్‌రెడ్డి

పార్టీ మారిన పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీ ఎమ్మెల్యేలు ఎ. జీవన్‌రెడ్డి, గణేష్‌ బిగాల మండిపడ్డారు. చంద్రబాబు, కేసీఆర్ ద్రోహం చేసిన పోచారం రేపు రేవంత్ ను కూడా మోసం చేస్తారని హెచ్చరించారు.

పోచారం లక్ష్మి పుత్రుడు కాదు లంక పుత్రుడు: మాజీ ఎమ్మెల్యేజీవన్‌రెడ్డి
X

మాజీ సభాపతి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి లక్ష్మి పుత్రుడు కాదు లంక పుత్రుడుగా మారాడని మాజీ ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు గణేష్ బిగాల ,డాక్టర్ మెతుకు ఆనంద్ లతో కలిసి ఆయన తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ లో పోచారం అన్నీ పదవులు అనుభవించారు. పోచారం ఆయన కుటుంబ సభ్యుల గురించి ఎన్నికల ప్రచారం లో చాలా నీచంగా మాట్లాడారు. అంతలా మాట్లాడిన రేవంత్ ఇపుడు కాంగ్రెస్ లో సిగ్గు లేకుండా చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు.

పార్టీ మారింది రైతుల కోసం కాదు రాళ్ల కోసం

పోచారం తన నియోజక వర్గానికి 7500 కోట్ల రూపాయల నిధులు తీసుకెళ్లారు . రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కేసీఆర్ బాన్సువాడ కు కేటాయించారు. కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది అన్న పోచారం ఇపుడు పార్టీకి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల కోసం పోచారం కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు ..రాళ్ళ (క్రషర్ )కోసం వెళ్లారని ఆరోపించారు. పోచారానికి కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారు ..ఆయనకు దమ్ముంటేరాజీనామా చేసి మళ్ళీ గెలువాలని సవాల్‌ విసిరారు. పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు .ఆ మాటలు ఎక్కడకు పోయాయి? అని ప్రశ్నించారు. బాన్సువాడ లో ఉప ఎన్నిక తథ్యమని ..ఎపుడు ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. చంద్రబాబు ,కేసీఆర్లకు ద్రోహం చేసిన పోచారం రేపు రేవంత్ ను కూడా మోసం చేస్తారని హెచ్చరించారు.

నలుగురు నాయకులు పోయినంత మాత్రాన నష్టం లేదు: గణేష్ బీగాల

మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగాల మాట్లాడుతూ.. తల్లి పాలు తాగే వాళ్ళు బీఆర్ఎస్ లో ఉంటారు ..డబ్బా పాలు తాగే వాళ్ళు టీడీపీ లో ఉంటారు అని పోచారం గతంలో అన్నారని గుర్తుచేశారు. అందరి కన్నా ఎక్కువ లబ్ధి పొందిన పోచారం పార్టీ మారడం దురదృష్టకరమన్నారు.ఆయనకు బీఆర్ఎస్ లో సీనియారిటీ కన్నా వయసు దృష్ట్యా పదవులు లభించాయి. పోచారం చేసిన పనికి ఆయన్ను దేవుడు కూడా క్షమించడు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్ లో నాయకులకు కొదవ లేదని, తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. నలుగురు నాయకులు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చిన నష్టం లేదన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అన్నారు.

Raju

Raju

Writer
    Next Story