బన్నీపై పవన్ హాట్ కామెంట్స్.. స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయ్యింది

40 సంవత్సరల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడే వాడని, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pavan kalyam hot comments bunny
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కపుడు సినిమాలో హీరోలు అడవులను కాపాడేవారు. వాటిని స్మగ్లింగ్ నుండి రక్షించేవారు. కానీ ఈ రోజుల్లో స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయ్యింది అని పవన్ అన్నారు. ఒక్క ఇండస్ట్రీ వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం నాకు కష్టం.. అది బయటికి మంచి సందేశం ఇవ్వలేదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే పవన్ చేసిన ఈ కామెంట్స్ తర్వాత మెగా ఫ్యాన్స్ అలాగే బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలయ్యింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన అల్లు అర్జున్ మూవీ పుష్ప స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. దాంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రకరకాల వాదనలకు దారి తీస్తున్నాయి. పవన్, పుష్ప సినిమాని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

గతంలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అల్లు అర్జున్ తన మామ పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇవ్వకుండా, నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు ఇచ్చాడు. దీంతో మెగా బ్రదర్ నాగబాబు ఘటుగా స్పందించారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే '' అంటూ నాగబాబు ట్వీట్ చేశాడు. ఒక వైపు తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, నా అనుకునే వాళ్లకు తప్పకుండా నా మద్ధతు ఉంటుందని అల్లు అర్జున్‌ స్పష్టం చేశారు. గతంలో దీనికి తోడు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ట్వీట్టర్‌లో అల్లు అర్జున్‌ని అన్ ఫాలో చేశాడు. దీంతో ఊహాగానాలు నిజమయ్యాయి.

బెంగళూరు నగరంలో కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే‌తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. కర్ణాటక సర్కార్‌తో వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు పవన్ కర్ణాటక వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పరిధిలో, పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు ఊళ్ల మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. అంతేకాదు ప్రాణ హాని కూడా కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమవుతాయి. కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉండడంతో కొన్ని కుంకీ ఏనుగులు ఏపీకి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖతో చర్చలు జరిపేందుకు పవన్ కర్ణాటక వెళ్లారు. ఇందులో భాగంగా కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రే‌తో చర్చలు జరిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story