మూడు నెలలుగా జీతాలు రాక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సూసైడ్..ఇదేమి ఇందిరమ్మ పాలన : కేటీఆర్

ప్రభుత్వ ఉద్యగులందరికీ ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలన్ని అవాస్తవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

wasim
X

ప్రభుత్వ ఉద్యగులందరికీ ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలన్ని అవాస్తవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మూడు నెలలుగా జీతాలు లేక సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నడు. కుటుంబం గడవక.. భార్యా పిల్లలను ఎలా పోషించాలో తెలియక.. మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడని కేటీఆర్ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. అతని మరుణానికి బాధ్యలెవరు అని ప్రశ్నించారు. సరిగ్గా శాలరీలు రాక, కుటుంబ సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన రాసిన సూసైడ్ లేటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది..తనను క్షమించాలంటూ భార్యకు లెటర్ రాశాడు. డియర్ రజనీ..నిన్న చాలా బాధపెట్టా మనకు ఎవరు లేరు.. పిల్లలు అలా కాకుడదని చాలా కలలు కన్న వచ్చే జన్మలో నా పిల్లలకు కొడుకుకై పుడతా అని రాశాడు.

ఇంకొకటి రజిని నీకు వీలైతే వీళ్లకు డబ్బులు ఇవ్వు ఎందుకంటే నేను చనిపోయాక వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న తరుణంలో, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. 6 గ్యారెంటీల పేరుతో అందరినీ ఆగం చేస్తున్నారు. ప్రజాపాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు పేద ప్రజలు బాగుపడతారని అంతా భావించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే స్కాంగ్రెస్ పాలన చేస్తూ ప్రజల్ని ఉద్యోగులను పీడిస్తున్నారు. రోజు ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగులు జీతాలు లేక కుటుంబాల్ని పోషించలేక ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా పరిస్థితులు చూస్తూనే ఉన్నాం.

Vamshi

Vamshi

Writer
    Next Story