మా పోటీ ఏపీతో కాదు.. ప్రపంచంతో : సీఎం రేవంత్‌రెడ్డి

అభివృద్ధి విషయంలో తమ పోటీ పక్కన ఉన్న ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో కాదని మా పోటీ అంతా ప్రపంచంతోనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

cbn
X

అభివృద్ధి విషయంలో తమ పోటీ పక్కన ఉన్న ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో కాదని మా పోటీ అంతా ప్రపంచంతోనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ నూతన క్యాంపస్‌కు బుధవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉందన్నరు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషితో భాగ్యనగరం లో ఐటీ అభివృద్ధికి పునాది పడింది. ఆ తరువాత సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్ధిని కొనసాగించారు. సైబరాబాద్ సిటీని అభివృద్ధి చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది అని కాగ్నిజెంట్​ నూతన క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందింది.రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని సీఎం అన్నారు. పొరుగు రాష్ట్రాలలో ఎక్కడా హైదరాబాద్ లాంటి నగరం లేదు.. పక్క రాష్ట్రాలతో మాకు పోటీ లేదు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం. పారిశ్రామిక వేత్తలకు ఈ వేదికగా పిలుపునిస్తున్నా. రండి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది అని సీఎం అన్నారు.

తెలంగాణన్ని మూడు భాగాలుగా విభజించి డెవలప్ చేయబోతున్నామని చెప్పారు. అర్బన్ సెమీ, అర్బన్, రూరల్ గా మార్చబోతున్నామని చెప్పారు. పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే మా లక్ష్యం అన్నారు. పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే మా లక్ష్యం అన్నారు.పది రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని ఇవాళే రాష్ట్రానికి వచ్చామని ఈ విదేశీ పర్యటనలో రూ.31500 కోట్ల పెట్టుబడలు సాధించామన్నారు. సంస్థల ఏర్పాటు ద్వారా 30 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఒప్పందాలు కుదరనున్నాయి. ఒప్పందాలు ఫాలో చేయడానికి ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story