తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఎన్టీఆర్ భారీ విరాళం

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సీఎం సహాయనిధి కింద యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ. కోటి విరాళం ప్రకటించారు.

jr ntr
X

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సీఎం సహాయనిధి కింద యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ. కోటి విరాళం ప్రకటించారు. రెండు ప్రభుత్వాలకు నా వంతుగా చెరొక రూ.50 లక్షలు విరాళమిస్తున్నా అని ఎక్స్ ద్వారా ఎన్టీఆర్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా ట్వీట్ చేశారు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే చాలామంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరికొంత మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు అపన్నహస్తం అందిస్తున్నారు. జల విలయంలో రెండు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి.

ఈ వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి ఆయన విరాళం ప్రకటించారు. రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు. ఆయన కుమారుడు, కూతురు కూడా రెండు రాష్ట్రాలకు రూ. 2.5 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘దేవరలో నటిస్తున్న విషయం తెలిసిందే. తీరప్రాంత నేపథ్యంలో సాగే భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నది. సెప్టెంబ‌ర్ 27న విడుదల కానుంది. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ ఆలీఖాన్‌ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Vamshi

Vamshi

Writer
    Next Story