ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లులో ఎటువంటి అవినీతి జరగలేదు : జగదీష్ రెడ్డి

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి చెల్లించిందే రూ.7 వేల కోట్లు అయితే.. అందులో రూ.6 వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.

Jagadish
X

జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారనన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నర్సింహా రెడ్డి కమిషన్ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని అన్నారు. ప్రభుత్వ పెద్దల మాదిరిగానే కమిషన్ చైర్మన్ మాట్లాడారని అసహనం వ్యక్తం చేశారు. అందుకే కేసీఆర్ తగు రితీలో సవివరంగా సమాధానం ఇచ్చారని స్పష్టం చేశారు.

కేసీఆర్ లేఖతో రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలిసియన్నారు. ఏదైనా ఒక అంశంపై ఎంక్వరీ చేపట్టప్పుడు విచారణాధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూదని, కానీ ఈ కమిషన్ అందుకు భిన్నంగా ఉందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి చెల్లించిందే రూ.7 వేల కోట్లు అయితే.. అందులో రూ.6 వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందాల్లో రూ.6 వేల కోట్ల అవినీతి జరిగాయనేది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. కరెంట్ కొనుగోళ్లతో రూ.6 వేల కోట్ల నష్టం కాదని.. తెలంగాణకు రూ.6 వేల కోట్లు లాభం జరిగిందన్నారు. నల్లగొండ జిల్లాలో థర్మల్ ప్లాంట్ పెడితే తప్పేంటని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story