జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల

మాకూ సమయమొస్తది.. వడ్డీతో సహా చెల్లిస్తాం : ఎమ్మెల్సీ కవిత

జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల
X

సమయం వస్తుందని.. తనను కుట్రపూరితంగా జైలుకు పంపినోళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం రాత్రి తిహార్‌ జైలు నుంచి విడుదలయిన తర్వాత జై తెలంగాణ నినాదం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఐదున్నర నెలల తర్వాత మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందన్నారు. 18 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని తెలిపారు. తల్లిగా పిల్లలను వదిలి ఐదున్నర నెలలు ఉండి ఇబ్బంది పడ్డానని భావోద్వేగానికి గురయ్యారు. తమకు సమయం వస్తది వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ''నేను తెలంగాణ బిడ్డను.. కేసీఆర్‌ బిడ్డను.. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు.. చెయ్యలేదు.. నేను మంచిదాన్నే కాదు మొండిదాన్ని.. నన్ను జైలుకు పంపి ఇంకా జగమొండిదాన్ని చేశారు.. నేను భయపడను.. ఇంకా తెగింపుతో, దైర్యంతో ప్రజాక్షేత్రంలో నిలుబడి పోరాడుత.. ఈ కష్టసమయంలో నాకు నా కుటుంబానికి అండగా ఉన్న వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్న..'' అన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి 9.12 గంటలకు తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి కవిత తిహార్‌ జైల్‌ లో విచారణ ఖైదీగా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తర్వాత కవిత భర్త అనిల్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ష్యూరిటీ ఇచ్చారు. అలాగే ఈడీ, సీబీఐ కేసుల్లో రూ.10 లక్షల చొప్పున ష్యూరిటీలు చెల్లించారు. ఈ ప్రాసెస్‌ పూర్తయిన తర్వాత కోర్టు రిలీజ్‌ ఆర్డర్‌ జారీ చేసింది. తిహార్‌ జైలు అధికారులు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించి, మిగతా ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి జైలు నుంచి ఆమెను విడుదల చేశారు. జైలు నుంచి బయకు రాగానే మొదట భర్త అనిల్‌ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తర్వాత అన్న కేటీఆర్‌ ను దగ్గరికి తీసుకున్నారు. ఆ తర్వాత తన చిన్నకుమారుడిని దగ్గరికి తీసుకొని ఎమోషన్‌ అయ్యారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ ను ఆత్మీయంగా పలకరించారు. విజయ అభివాదం చేస్తూ బారికేడ్లను దాటుకొని వాహనం వద్దకు వెళ్లారు. విజయ అభివాదం చేస్తూ బారికేడ్లను దాటుకొని వాహనం వద్దకు వెళ్లారు.





Next Story