చారాణ కోడికి..! బారాణ మసాలా... అంటూ రేవంత్‌కు కేటీఆర్‌ కౌంటర్‌

రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు.

చారాణ కోడికి..! బారాణ మసాలా... అంటూ రేవంత్‌కు కేటీఆర్‌ కౌంటర్‌
X

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊరించి.. ఊరించి ఏడునెలలు ఏమార్చి చేసిన రుణమాఫీ తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ సర్కార్‌ చేసిన రుణమాఫీ తీరు తెలంగాణ ప్రజలకు చారాణ కోడికి బారాణ మసాల సామెతను గుర్తు చేసిందని ఎద్దేవా చేశారు.

రుణమాఫీ కోసం ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలే రైతు మాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయని ధ్వజమెత్తారు. దీంతో రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని విమర్శించారు. రుణమాఫీకి అన్నిఅర్హతలు ఉన్నా.. ఎందుకు మాఫీ కాలేదో చెప్పేవారు లేరు. రైతులు తమ గోడు చెప్పుకుందామంటే వినేవారు లేరు. అర్హులైన లబ్ధిదారులకు రుణమాఫీ కాలేదు. వాళ్లంతా అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు? 40 లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశ మిగిల్చినందుకా? 30 లక్షల మంది రైతులను మోసం చేసినందుకా ఈ సంబురాలు అని నిలదీశారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రెండు సీజన్లు అయినా.. రైతుభరోసా ఇంకా మొదలుపెట్టలేదు. జూన్‌లో వేయాల్సిన రైతు రైతు భరోసా జులై వచ్చినా రైతుల ఖాతాల్లో పైసలు జమ కాలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కౌలు రైతులకు రూ. 15 వేలు ఇవ్వలేదు. రైతు కూలీలకు రూ. 12 వేలు అమలు చేయలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మభ్యపెట్టే కాంగ్రెస్‌ పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంత కాలం అటెన్షన్‌ డైవర్షన్‌.. ఇప్పుడేమో ఫండ్స్‌ డైవర్షన్‌ అని కేటీఆర్‌ ఎక్స్‌లో ఎద్దేవా చేశారు..

Raju

Raju

Writer
    Next Story