ఇదిగిదిగో ఖైరతాబాద్‌ మహా గణపతి

నేటి నుంచి సప్తముఖ గణపతికి పూజలు

ఇదిగిదిగో ఖైరతాబాద్‌ మహా గణపతి
X

ఖైరతాబాద్‌ మహా గణపతి భక్తుల పూజల కోసం కొలువుదీరాడు. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి 70 ఏళ్లవుతున్న సందర్భంగా 70 అడుగుల సప్తముఖ మహా గణపతిని ఈసారి సిద్ధం చేశారు. శిల్పి చిన్న స్వామి రాజేంద్రన్‌ ఆధ్వర్యంలో 200 మంది కళాకారులు సప్తముఖ గణపతి మట్టి విగ్రహాన్ని సిద్ధం చేశారు. 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మహా గణపతి భక్తులకు శనివారం నుంచి దర్శనమివ్వబోతున్నారు. గణపతి తలకు రెండు వైపులా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మీ, సరస్వతి రుపాలు, మహాగణపతికి 14 చేతులు ఉండగా, అందులో కుడి వైపు చేతుల్లో చక్రం, అంకుశం, పుస్తకం, త్రిశూలం, కమలం, శంఖం, ఎడమ వైపున రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉన్నాయి. మహా గణపతికి కుడి వైపున పది అడుగుల ఎత్తులో అయోధ్య బాలరాముడు, ఎడమ వైపున 9 అడుగుల ఎత్తులో రాహుకేతువుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. మహా గణపతి పాదాల చెంత 3 అడుగుల మూషిక వాహనం ఉంటుంది. గణపతి విగ్రహానికి కుడి వైపున శ్రీనివాస కళ్యాణం విగ్రహాలు, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణం విగ్రహాలు ఏర్పాటు చేశారు.

Next Story