ఏపీలో పెన్షన్లు పెంపు.. ఊసెత్తని రేవంత్ సర్కారు

ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది లబ్ధిదారులు

Telangana Pension
X

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఊదర గొట్టిన సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన ఏడు నెలలు గడుస్తు పెన్షన్ పెంపు ఊసే ఎత్తడం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మొత్తం రూ 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.. కానీ హామీలు నీటి మూటలుగా మారిపోయాయి. ప్రక్క రాష్ట్రం ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల రూ.4 వేలు పెంచారు. మరి తెలంగాణలో పెన్షన్ల ఎప్పుడు పెంచుతారని ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 44 లక్షల మంది పింఛనుదారులు ఉండగా.. కొత్త పింఛన్ల కోసం తాజాగా 24.84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఎన్నింటికి ఆమోదం లభిస్తుందో దేవుడికే తెలియలి.

ప్రస్తుతం సాధారణ పింఛను రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ చేసిన హామీల్లో సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 ఇస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే మొదట పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచి అందించింది. రెండో టర్మ్‌లో 2,000కు పెంచింది. 2014 నవంబర్‌లో ఆసరా పెన్షన్‌ పథకాన్ని ప్రారంభించి కరోనా లాంటి కష్టకాలంలోనూ నిరాటంకంగా అందించింది. ప్రారంభంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, హెచ్‌ఐవీ బాధితులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు పింఛన్లు అందజేసింది. 2015 మార్చి బీడీ కార్మికులకు, 2017 ఏప్రిల్‌ నుంచి ఒంటరి మహిళలకు, 2018 ఏప్రిల్‌ని ఫైలేరియా బాధితులకు, 2022 ఆగస్టు నుంచి డయాలసిస్‌ పేషెంట్లకు పింఛన్లను వర్తింపజేసింది. ఏపీలో పెన్షన్లు పెరగటంతో రేవంత్ సర్కార్ ఎప్పుడు పెన్షన్ పెంచుతారని ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story