భారీ వర్షాలు.. వరద సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్‌

అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

భారీ వర్షాలు.. వరద సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్‌
X

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఆదివారం సీఎం రేవంత్‌ రెడ్డి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో ఫోన్‌ లో మాట్లాడి రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్‌, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎక్కవ అత్యవసర సేవలు అందించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని, అందరు తక్షణమే విధుల్లో చేసి వరద సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు తెలియజేయాలన్నారు. వరద ప్రభావ ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు 24 గంటలు అలెర్ట్‌ ఉంటూ వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.

Next Story