కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 27కు వాయిదా

హైకోర్టులో కేసు డైరీ ఉండగా.. కౌంటర్‌ దాఖలు చేయడానికి ఆలస్యం ఎందుకని అదనపు సోలిసిటర్‌ జనరల్‌ను విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది.

కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 27కు వాయిదా
X



ఢిల్లీ మద్యం కేసులో కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 27వ తేదీకి న్యాయంస్థానం వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఈ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. కౌంటర్‌ దాఖలుకు మరికొంత కావాలని ఈడీ కోరిందని అదనపు సోలిసిటర్‌ కోరారు. రేపటిలోగా కౌంటర్‌ దాఖలు చేస్తే శుక్రవారం ఈడీ, సీబీఐ కౌంటర్లపై రీజాయిండర్‌ వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కవిత తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. తమకు సమయం కావాలని, గురువారంలోపు కౌంటర్‌ దాఖలు చేస్తామని ఈడీ న్యాయవాది కోర్టుకు వెళ్లడించారు.

ఈ కేసులో ఈడీ, సీబీఐల.. ఛార్జిషీట్స్‌, కంప్లైంట్ కాపీలు దాఖలు చేయడంతో పాటు దర్యాప్తు ముగిసిందని ట్రయల్‌ కోర్టుకు తెలిపాయని కవిత తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ కౌంటర్‌పై విచారణ చేపట్టాలని కోరారు. రెండు పిటిషన్లను ఒకేసారి విచారణ చేపడుతామని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం పేర్కొన్నది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా.. కౌంటర్‌ దాఖలు చేయడానికి ఆలస్యం ఎందుకని అదనపు సోలిసిటర్‌ ను ధర్మాసనం ప్రశ్నించింది. మొదటిసారి ఈ కేసు ఇక్కడి వచ్చిందని సవివరంగా కోర్టుకు వివరాలు అందిస్తామని అదనపు సోలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలుపగా.. గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

అలాగే ఈ కేసు మొత్తంలో ఉన్నది ఒకే మహిళ అని ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న మనీశ్‌ సిసోడియా, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేశారని కవిత కు బెయిల్‌ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఇరువురి వాదన అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 27 కు వాయిదా వేసింది.

Raju

Raju

Writer
    Next Story