గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి.మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
X

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఫైనల్‌ కీతో పాటు రిజల్ట్స్‌ విడుదల చేశారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాల కోసం https://www.tspsc.gov.in క్లిక్‌ చేయండి. గ్రూప్‌-1లో 563 పోస్టులకు మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమ్స్‌ పరీక్షను టీజీపీఎస్సీ జూన్‌9 న నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లోల మంది అభ్యర్థుల హాజరయ్యారు. ప్రైమరీ కీని జూన్‌ 13న విడుదల చేసింది. 17 వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తామని సర్వీస్‌ కమిషన్‌ తెలిపిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించున్నట్టు ఇప్పటికే సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది.

అయితే గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:50 చొప్పన కాకుండా 1:100 చొప్పున అవకాశం కల్పించాలని కొన్నిరోజులుగా నిరుద్యోగ అభ్యర్థుల నిరసనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. సాంకేతిక సమస్యలు, న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. నిరుద్యోగులు దీనిపై ఆందోళనలు ఉధృతం చేసిన సమయంలోనే.. ఈ అంశంపై నిరుద్యోగుల అభ్యర్థలను అర్థం చేసుకున్నామన్నట్టు కంటితుడుపు సీఎం సమీక్ష చేసినట్టు లీకులు వదిలారు. కానీ సీఎం ఢిల్లీలో చెప్పినట్టే, సర్వీస్‌ కమిషన్‌ 1:50 చొప్పునే మెయిన్స్‌కు ఎంపిక చేస్తామన్న ప్రకారమే తాజాగా ఫలితాలు విడుదల చేసింది.

Raju

Raju

Writer
    Next Story