రేవంత్‌ అబద్ధాలు చూసి సమాధిలో ఉన్న గోబెల్స్‌ ఉలిక్కిపడుతడు: కేటీఆర్‌

సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చూసి తన సమాధిలో గోబెల్స్‌ ఉలిక్కిపడ్డారని బీఆర్‌ఎస్‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్‌, బీజేపీలు యత్నిస్తున్నాయన్నారు.

రేవంత్‌ అబద్ధాలు చూసి సమాధిలో ఉన్న గోబెల్స్‌ ఉలిక్కిపడుతడు: కేటీఆర్‌
X

సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చూసి తన సమాధిలో గోబెల్స్‌ ఉలిక్కిపడ్డారని బీఆర్‌ఎస్‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్‌, బీజేపీలు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ తమ పార్టీ అన్న కేటీఆర్, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా, వాటిని క్రూరంగా అణిచివేసి, వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. రేవంత్‌ సీఎం అయ్యాక కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరు ప్రతీ తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు.

తెలంగాణలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వలె బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి ఎవరూ వేలంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతోని తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని, కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించడంతో ఇప్పటిదాకా అక్కడ నుంచి ఒక తట్టెడు బొగ్గు కూడా ఆ కంపెనీలు ఎత్తలేవని తెలిపారు. చివరి రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 2 బ్లాకులను ఏకపక్షంగా వేలం వేసింది. వేలంలో గనులను దక్కించుకున్న రెండు కంపెనీలు కేవలం బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ప్రయోజనాల కోసం నిలబడటంతోనే మైనింగ్ ప్రారంభించలేమన్నారు. కేంద్రంలోని బీజేపీ గనులను కేటాయించిన, కేవలం రాష్ట్ర ప్రభుత్వ కఠిన వైఖరి వల్లనే నిబద్ధత వల్లనే ఆ కంపెనీలు సింగరేణి బొగ్గును తవ్వలేకపోయాయని ఆ పూర్తి క్రెడిట్ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. కానీ రేవంత్ పేర్కొన్న ఆ రెండు కంపెనీలు మహారాష్ట్రలో కాంగ్రెస్ మరియు శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టాక్లి, జెన, బెల్లోర గనులను దక్కించుకున్న విషయం మర్చిపోవద్దని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

తెలంగాణ ఆస్తులు, హక్కులు, వనరులు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టే నేరాల్లో కాంగ్రెస్‌, బీజేపీలు భాగస్వాములు అని ఆరోపించారు. రాష్ట్ర నదీ ప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో బీజేకి కాంగ్రెస్‌ సహకారం అందించింది. గనుల వేలంలో పాల్గొన్న మిమ్మల్ని, మీ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని, తెలంగాణ రాష్ట్రానికి మీరు, మీ జాతీయ పార్టీలు చేస్తున్న అన్నిరంగాలకు ద్రోహం చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని కేటీఆర్‌ హెచ్చరించారు. ఈ మేరకు కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

Raju

Raju

Writer
    Next Story