నేటి నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు...గల్లీ గల్లీల్లో కొలువుదీరిన గణనాథుడు

గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకొనేందుకు భాగ్యనగరం సర్వం సిద్దం అయింది. ప్రతి గల్లీలో గణనాథుడు కొలువుదీరనున్నాడు. తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలందుకోనున్నాడు.

Kharithabad
X

గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకొనేందుకు భాగ్యనగరం సర్వం సిద్దం అయింది. ప్రతి గల్లీలో గణనాథుడు కొలువుదీరనున్నాడు. తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలందుకోనున్నాడు. కొలువుదీరనున్నాడు.సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ ఎక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహా గణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి మరింత వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. కాగా, ఇవాళ్టి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో పూజలకు ఖైరతాబాద్ భారీ గణపతి సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తి కావడంతో 70 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఈసారి శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శమివ్వనున్నారు. మొత్తం ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మొదటి పూజ ప్రారంభం కానుంది. ఈ పూజలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. గతంలో గవర్నర్లు తొలి పూజలో పాల్గొనేవారు. కానీ, ఈసారి అందుకు భిన్నంగా నేరుగా ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిమను చూసేందుకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పోలీసులు, అధికారులు చేశారు. హైదరాబాద్‌లో బాలపుర్ గణపతికి చాల ప్రత్యేకత ఉంది. అయోధ్య రామ మందిరంలో బాలాపూర్ గణేష్ ఏర్పాటు చేశారు. ఈ సారి రామ మందిర మండపం తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బాలాపూర్ గణేష్. దీంతో బాలాపూర్ రామమందిర మండపం..భక్తులను ఆకట్టుకుంటున్నారు.


బాలాపూర్ గణపతి అంటే మొదటగా గుర్తొచ్చేది లడ్డూ వేలం అన్న సంగతి తెలిసిందే. బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటలో ప్రత్యేక స్థానం దక్కింది. 1994లో మొదటగా ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రతి యేటా లడ్డూ వేలం రికార్డు స్ధాయిలో కొనసాగుతుందన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గణేశ్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అయితే, ఈ పోస్టులో మాజీ సీఎం కేసీఆర్‌ ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లోని ఆయన డెస్క్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఫొటో తీసి పెట్టారు. మొత్తం బంగారు ఆభరణాలతో ఉన్న ఈ విగ్రహం మెరిపోతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహకులకు సూచించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story