బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు చేశారు. 12 మంది బీఆర్ఎస్ నాయకులపై ఐపీసీ 353 , 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
- By VamshiLoading...
- | 21 Jun 2024 10:46 AM GMT
X
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమన్‌తో పాటు మన్నే గోవర్ధన్, దూదిమెట్ల బాలరాజు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లపైన పోలీసులు కేసు ఫైల్ చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. 12 మంది బీఆర్ఎస్ నాయకులపై ఐపీసీ 353 , 448 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయనను రేవంత్ ఆహ్వానించారు.
ఈ విషయం తెలుసుకున్న బాల్క సుమన్, మన్నే గోవర్ధన్, దూదిమెట్ల బాలరాజు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కలవడానికి వేళ్లారు..దీంతో పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తాజాగా బాల్క సుమన్, గెల్లు, బాలరాజు, గోవర్ధన్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పోలీసు విధులు అడ్డుకోవడం, ఇంట్లోకి అక్రమ చొరబాటుతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో వీరిని పోలీసులు వీరిని రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా, బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు.