వేతన జీవికి నిరాశే!

కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను విధానంలో పన్ను శ్లాబ్‌లలో వేతన జీవికి నిరాశే మిగిలింది.

వేతన జీవికి నిరాశే!
X

వ్యక్తిగత పన్ను విధానంలో పన్ను శ్లాబ్‌లలో ఎలాంటి మార్పులు ఉంటాయోనని ఎదురుచూసిన వాళ్లకు కేంద్ర ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి ఒడ్జెట్‌లో నిరాశే ఎదురైంది. శ్లాబులలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబ్‌లకు మాత్రం స్వల్ప మార్పులు చేశారు. దీని ప్రకారం రూ. 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు 5 శాతం, రూ. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10 శాతం, రూ. 10 లక్షల నుంచి 12 ఓల వరకు 15 శాతం, రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 20 శాతం, రూ. 15 లోల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి 30 శాతం పన్ను వర్తిస్తుందని బడ్జెట్‌లో చెప్పారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ. 50 వేల నుంచి రూ.75 వేలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

గత ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్‌లో పన్ను శ్లాబ్‌లల విధానాన్నే ఇప్పుడూ కొనసాగించారు. పన్ను రాయితీ పరిమితులతో మార్పులేమీ చేయలేదు. గత బడ్జెట్‌లో పేర్కొన్న విధంగానే 3 లక్షలవరకు ఎలాంటి పన్ను లేదు. 3-6 లక్షల వరకు 5 శాతం పన్ను విధించిన కేంద్రం ఈసారి ఆ శ్లాబ్‌లో 3-7కు మాత్రమే పెంచింది. 6-9 లక్షలవరకు 10 శాతం ఉన్న పన్ను విధానాన్నిఈసారి 7-10 లక్షలుగా పేర్కొన్నది. అలాగే 9-12 శాతం ఉన్న శ్లాబ్‌ విధానాన్ని 10-12 లక్షలకు మార్పులు చేసి అదే 15 శాతం పన్ను విధించనున్నట్లు తెలిపింది.

గత ఏడాది బడ్జెట్‌లో పన్నులపై శ్లాబ్‌ విధానం ఇది

0-3 లక్షలు నిల్

3-6 లక్షలు 5%

6-9 లక్షలు 10%

9-12 లక్షలు 15%

12-15 లక్షలు 20%

15 లక్షల పైన 30%

2014 నుండి ఆదాయపు పన్ను శ్లాబ్‌లు మారలేదు. ప్రాథమిక వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. ఈసారి శ్లాబ్‌ విధానంలో మార్పులు చేస్తారని ఆశించిన వారిపై ఆశలపై మోడీ సర్కార్‌ నీళ్లు చల్లింది. పదేళ్ల కాలంలో సంస్కరణలే తప్పా సంక్షేమం గురించి ఆలోచించలేదు. ఫలితంగా పదేళ్ల కాలంలో నలభై ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు చూసింది ట్రైలరే అని ఇక ముందు సినిమా చూస్తారన్న మాటల సారాంశం బడ్జెట్‌లో స్పష్టమైంది. కాకులను కొట్టి గద్దలకు పంచాలన్న విధానమే కనిపించింది.

Raju

Raju

Writer
    Next Story