ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం.. కమిటీలతో సరి

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Prajabhavan
X

తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. ప్రజా భవన్ వేదిగా దాదాపు రెండు గంటల పాటు సాగింది. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీని, అధికారులతో మరో కమిటీని వేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా చర్చ సాగింది. పదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాల చర్చించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా పరిష్కరాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు.

మంత్రుల కమిటీలో తెలంగాణ నుండి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా సాయంత్రం 6.10 నిమిషాలకు స్టార్ట్ అయిన ఈ భేటీ.. దాదాపు గంటన్నర పాటు సాగింది. ప్రధానంగా రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు,పెండింగ్‌ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు, హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశం, ఉద్యోగుల విభజన అంశాలు చర్చించినట్లు తెలుస్తొంది. హైదరాబాద్‌లో కొన్ని భవనలు తమకు కేటాయించాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. ఏపీలో కలిపిన 7 మండలలు 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని రేవంత్ అడినట్లు తెలుస్తోంది.

Vamshi

Vamshi

Writer
    Next Story