ఖైరతాబాద్‌ బడా గణపతి తొలిపూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌

ఖైరతాబాద్‌ మహా గణపతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. సప్తముఖ వినాయకుని తొలిపూజలో సీఎం పాల్గొన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి బడే గణపతికి గజమాల, పండ్లు సమర్పించారు.

CM Revanth
X

ఖైరతాబాద్‌ మహా గణపతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. సప్తముఖ వినాయకుని తొలిపూజలో సీఎం పాల్గొన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి బడే గణపతికి గజమాల, పండ్లు సమర్పించారు. ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో మహాగణపతి వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకున్న మీదట ఈ నెల 17 వ తేదీన ఘనంగా నిమజ్జన వేడుక జరుగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పూజలో పాల్గొననున్నారు. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి.

బడా గణేష్ విగ్రహ పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం రూపొందింది. ఇక మహా గణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు రానున్నారు. వారి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా ప్రత్యేకంగా షెడ్లను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతేడాది బడా గణేష్‌ని దాదాపు 22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని భాగ్యనగర గణేశ్ ఉత్సవ కమిటీ పేర్కొన్నది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు

Vamshi

Vamshi

Writer
    Next Story